దిగుబడిని చూసి వారు ఓర్వలేకపోతున్నారు

కరీంనగర్:  ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని పౌరసరఫరాల మంత్ర గంగుల కమాలాకర్‌ మండిపడ్డారు. కొత్తపల్లిలో మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం మంత్రి  ప్రారంభించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంత పెద్ద ఎత్తున ఏనాడు పంట రాలేదని,  కొనుగోళ్లు కూడా గతంలో ఎప్పుడు జరగలేదన్నారు. కాళేశ్వరం జలాలు, 24 గంటల కరెంట్ వల్లే పంట దిగుబడి పెరిగిందని పేర్కొన్నారు. 21 రోజుల్లో 21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, సగటున రోజుకు లక్ష మెట్రిక్ టన్నులు కోనుగోలు చేస్తున్నామని తెలిపారు. 3.5 లక్షల మంది రైతులు ఇప్పటి వరకు తమ పంటను అమ్ముకున్నారని, రాష్ట్రంలో ఉన్న 6540 కోనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటికే 5789 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ జరుగుతుంటే కాంగ్రెస్, బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని, భారీ ఎత్తున పంట దిగుబడి వచ్చి రైతులు సంతోషంగా ఉండటం ప్రతిపక్ష పార్టీలకు ఇష్టం లేదని ధ్వజమెత్తారు. ఇంత పంట దిగుబడి చూసి ఓర్వలేకే ప్రతి పక్షాలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. (రేషన్‌ కార్డులేని వారికి పోస్టల్‌ ద్వారా రూ.1,500)