దేశీయస్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా లాభాలతో దూసుకుపోయాయి. ఆరంభ లాభాలనుంచి పటిష్టంగా కదలాడటంతో దలాల్ స్ట్రీట్ కళ కళలాడింది. ఇంట్రాడేలో సూచీ సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా ఎగిసింది. హైస్థాయిల్లో లాభాల స్వీకరణతో స్వల్పంగా వెనక్కి తగ్గి చివరకు సెన్సెక్స్ 997 పాయింట్లు లాభంతో 33717వద్ద, నిఫ్టీ 307 పాయింట్ల లాభంతో 9860 వద్ద ముగిసింది. తద్వారా సెన్సెక్స్33600 స్థాయిని, నిఫ్టీ 9850కి ఎగువన పటిష్టంగా ముగియడం విశేషం. మెటల్ , ఆటో, బ్యాంకింగ్ రంగ షేర్లు లాభపడగా, ఫార్మ షేర్లలో లాభాల స్వీకరణ కనిపించింది. మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవాళ విడుదల చేయనుంది. భారీ లాభాల అంచనాలతో ఆర్ఐఎల్ లాభపడింది. టాటా మోటార్స్, యూపీఎల్, ఓన్జీజీసీ, వేదాంతా, హిందాల్కో, హీరోమోటో కార్ప్, గెయిల్ భారీగా లాభపడ్డాయి. సన్ ఫార్మా, హెచ్ యూ ఎల్, సిప్లా, ఇండస్ ఇండ్, ఆసియన్ పెయింట్స్, ఐటీసీ, జీ నష్టపోయాయి.
లాభాల హుషారు: నిఫ్టీ @9860