హైదరాబాద్: బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఎలాంటి లోపం లేదని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్ళడం వల్లే బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై ఇటీవల ప్రమాదం జరిగిందని తెలిపారు. లోకేశ్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అనుమతి రాగానే ఫ్లై ఓవర్‌పైకి మళ్లీ వాహనాలను అనుమతి ఇస్తామని ఆయన వెల్లడించారు. మరో పదిరోజుల్లో బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ తెరిచే అవకాశముందని తెలిపారు.
బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్.. కీలక పరిణామం!